కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం

నవతెలంగాణ – రెంజల్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి కి తమ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి లు స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన రెంజల్ గ్రామాన్ని వారు సందర్శించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యానికి పథకాలను అమలు పరచడంతో పాటు, రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయక, కేవలం వాగ్దానాలకి పరిమిత మయ్యారని వారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు లేపే గ్యారెంటీ పథకాలను అమలు పరిచే దిశలో ముందుకు కొనసాగుతోందది వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెంజల్ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, జిల్లా నాయకులు తాహెర్ బిన్ అందన్, అరికెల నరసారెడ్డి ,జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, జి సాయి రెడ్డి, సాయిబాబా గౌడ్, ధనుంజయ్, తాజా మాజీ సర్పంచ్ రమేష్ కుమార్, మాజీ ఎంపిటిసి నరసయ్య, గంగా కృష్ణ, గయా ఉద్దీన్, జావిద్, బి. రవి, శ్రీనివాస్, సవిత సంతోష్, ఇందిరా రెడ్డి, సురేందర్ గౌడ్,  రాజు, కార్తీక్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.