కాంగ్రెస్ తోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు

 

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టీతోనే  అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు.  గురువారం మండల కేంద్రంలోని పలు కుల సంఘాల సభ్యులను కలిసి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జీవన్ రెడ్డిని భారీ  మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలనాతో రాష్ట్రంలో మార్పు మొదలైంది అన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం  చర్యలు చేపట్టిందన్నారు.ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటి ఫలాలను ప్రజలు పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను కుల సంఘల సభ్యులకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గడప గడపకు కాంగ్రెస్ పేరుతో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న, భవిష్యత్తులో అమలు చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ఓటర్లకు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా జీవన్ రెడ్డి ని గెలిపించాలని కోరుతున్నారు.