ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాల గ్రామానికి చెందిన బి పి యం (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) ఊకే నాగేశ్వరరావు తల్లి ఊకే సమ్మక్క అంత్యక్రియలు సోమవారం అశ్రు నయానాలతో, జనసముద్రంతో కొనసాగాయి. అనారోగ్యంతో ఆదివారం మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలు సొంత గ్రామంలోని స్మశాన వాటికలో జరిగాయి. వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రముఖులు, పలు ప్రజా సంఘాల నేతలు సమ్మక్క అంత్యక్రియలకు హాజరై మృతదేహానికి నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య సమ్మక్క అంత్యక్రియలు ముగిశాయి.