తెరుచుకొని పశువుల దవాఖాన..

Cattle dispensary opened..– అందని వైద్యం, మూడు నాలుగు గంటలు ఎదురుచూసి తిరిగి వెళ్ళిన పశువుల దారులు

– క్యాంపులు కొనసాగుతున్నట్లు జిల్లా అధికారి సమాధానం
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని పశు వైద్యశాల సోమవారం నాడు తెరుచుకోలేకపోయింది. రోగాల బారిన పడిన పశువులను పశువుల దారులు దవఖానకు తీసుకువస్తే దవఖాన చేర్చుకోలేక ఎప్పుడు వస్తారునని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దాదాపు మూడు నాలుగు గంటల పాటు వైద్యం కోసం ఎదురుచూసిన పశువులదారులు ఏ ఒక్కరు రాకపోవడంతో రోగాలతో బాధపడే పశువులను తిరిగి ఇంటికి తీసుకెళ్ళారు. పశు వైద్య దవఖాన చేర్చుకోలేకపోవడాన్ని నవ తెలంగాణ విలేఖరి సోమవారం దాదాపు 11 గంటల తర్వాత జిల్లా పశువైద్య అధికారికి ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగా.. దవఖాన మూసి ఉండడం కారణం క్యాంపులు కొనసాగుతున్నట్లు జిల్లా పశువైద్యాధికారి సమాధానమిచ్చారు. క్యాంపులు దేని గురించి కొనసాగుతున్నాయి. వాటి వివరాలు ఎందుకు తెలపలేదని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని సరి అయిన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. వాతావరణం సరిగ్గా లేక పశువులు అనారోగ్యాలకు గురై చికిత్సల నిమిత్తం పశువుల దారులు దవఖానకు తీసుకువస్తే పశు వైద్య దవఖాన మూసే ఉండడం ,పశువుల దారులు దూరప్రాంతాల నుండి వచ్చి గంటల తరబడి వేచి చూసిన ఏ ఒక్కరు రాకపోవడం అనారోగ్యాల పాలైన పశువులను వెనిదిరిగి తీసుకు వెళ్లడం జరిగింది. మండల కేంద్రంలో పశు వైద్యశాల మూసి ఉంచడం పశువులకు ఎలాంటి రోగం వచ్చినా అందకపోవడంపై పశువుల దారులు పశువైద్య శాఖ అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపులు నిర్వహిస్తే దవాఖానలో ఏ ఒక్కరైనా పశువుల కొరకు వైద్యం అందించడానికి స్థానికంగా ఉంటే వైద్యం అందుతుందని, క్యాంపుల పేర్లు చెప్పుకుంటూ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ఏమిటని పశువుల దారులు పశువైద్యాధికారులపై మండిపడుతున్నారు. మూగజీవులకు వైద్యం అందక చనిపోతే బాధ్యులు ఎవరంటూ పశువుల దారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. జిల్లా అధికారులు ఇలాంటి తప్పులు జరగకుండా పశు వైద్యశాల ఎప్పటికీ తెరిచి ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పశువులదారులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.