రేపటి నుంచి ఓపెన్‌ చెస్‌ టోర్నీ

Open chess tournament from tomorrowహైదరాబాద్‌: బొడిగ బాలయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ రేపటి నుంచి ఆరంభం కానుంది. చెర్లపల్లిలోని ఈసీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌లో బాలురు, బాలికల అండర్‌-7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఏడు రౌండ్ల పాటు జరుగనున్న ఈ పోటీలను ఫిడె రూల్స్‌ ప్రకారం స్విస్‌ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నామని తెలంగాణ చెస్‌ సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌ తెలిపారు. టోర్నమెంట్‌లో పోటీపడేందుకు ఆసక్తిగల ప్లేయర్లు 7337578899, 7337399299 నంబర్లను సంప్రదించవచ్చు.