నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో ఓపెన్ పది, ఇంటర్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 12 నుండి 21 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించలాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టడీ సెంటర్ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ గంగా కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఓపెన్ పది, ఇంటర్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులు మాత్రమే కాకుండా ఫెయిల్ అయిన వారు కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చనిఅపరాధ రుసుం తో వచ్చేనెల మార్చి 3 వరకు చెల్లించాలని తెలిపారు. మిగితా వివరాలకు పాఠశాల పని వేళల్లో లేదా సెల్ 9866343898 కు సంప్రదించాలని కోరారు.