రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్పీ అవినాష్ కుమార్ హాజరై చిన్నారులకు పలు విషయాలుతెలియజేశారు.పోలీస్ స్టేషన్ విధులు, బాధ్యతలు, డయల్ 100 తదితర అంశాలను వివరించారు. ఆయుధాలు ఏకే 47, గన్, మెటల్ డిటెక్టర్ ఎలా వాడుతారో తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ నైలు, ఎస్. ఐ.శ్రీనివాస్ యాదవ్, కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ అప్పాల జ్యోతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.