
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి రాజ్ గంగారెడ్డి ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండినటువంటి వారు ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతిలో అడ్మిషన్ పొందవచ్చని అలాగే 10వ తరగతి పాస్ అయిన వారు ఓపెన్ విధానంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకొవచ్చని రెగ్యులర్ విధానంలో పాస్ అయిన వారితో సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ తులా రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.