ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం

నవతెలంగాణ -పెద్దవూర
ఓపెన్ టెన్త్, ఇంటర్లలో చేరేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీను వాసులు, ఓపెన్ టెన్త్ ఇంటర్ కోఆర్డినేటర్ గవ్వ హిమవంతరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండ లంలోని వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు తెలిపారు. పదవ తరగతి లో ప్రవేశా నికి 14ఏళ్లు, ఇంటర్లో ప్రవేశానికి 15 ఏళ్లు నిం డి ఉండాలని తెలిపారు. పదో తరగతి వారు రికార్డ్ సీటు, ఆధార్ కార్డులతో పాస్పాట్ సైజ్ ఫొటోలు, ఇంటర్ అభ్యర్థులు పదో తరగతి మెమో, టీసీ, ఆధార్ కార్డు ఫొటోలతో అడ్మిషన్ పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8919350463, 99085 45764 నంబర్లను సంప్రదించాలని కోరారు.