– బద్రీనాథ్ ఆలయం
డెహ్రాడున్ : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత సాంప్రదాయ డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్ ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పూజారులు తెరిచారు. దీంతో చార్‌ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో బద్రీనాథ్, కేదార్ నాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాలను యాత్రికులు సందర్శిస్తారు. కేదార్‌నాథ్, యుమునోత్రి, గంగోత్రి ఆలయాల తలుపులను అక్షయ తతీయ సందర్భంగా గత శుక్రవారమే తెరిచారు. అధికారిక సమాచారం ప్రకారం కేదార్‌నాథ్‌ను తొలి రోజు రికార్డు స్థాయిలో దాదాపు 29 వేల మంది సందర్శించారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు 7,37,885 మంది బద్రీనాథ్ సందర్శన కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. గతేడాది 18,39,591 మంది ఆలయాన్ని సందర్శించారు.