నవతెలంగాణ – హైదరాబాద్
నగరంలో కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన యునిమోని కొత్తశాఖను సంస్థ సీఈఓ కృష్ణన్.ఆర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ”మా కొత్త శాఖ ఖాతా దారుల ఆర్థిక అవసరాలను అత్యుత్తమ సేవా ప్రమాణాలతో అందించడానికి మరింత సులభంగా, సౌకర్యంగా అనుభవాన్ని అందించ డానికి రూపొందించబడింది. విలువలకు అంకితబద్ధంగా ఉంటాము. దీర్ఘకాలిక సంబంధాలను నిర్మిం చడం, అపరిమిత ఆర్థిక పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తాము” అని కృష్ణన్ అన్నారు. ఈ శాఖ ప్రారంభోత్సవంలో ఆ సంస్థ ఉన్నతాధికారులు మన్జో వి మాథ్యూ, బి సతీష్ కుమార్, రతిష్ ఆర్, ప్రకాష్ భాస్కర్ (ఫారెక్స్), జాన్ జార్జ్ (ట్రావెల్ అండ్ హాలిడేస్), టైటస్ కే (గోల్డ్ లోన్) పాల్గొన్నారు. దీన్ని టి శ్రీనివాస్ రెడ్డి, కె శ్రీనివాస్, బి శ్రీకాంత్ నిర్వహించారు.