గచ్చిబౌలిలో బే విండో గ్యాలరీ ప్రారంభం

హైదరాబాద్‌: ఫర్నీచర్‌, గృహాలంకరణ ఉత్పత్తుల బ్రాండ్‌ బే విండో హైదరాబాద్‌లో విస్తరించి నట్లు పేర్కొంది. గురువారం గచ్చిబౌలిలో తమ నూతన గ్యాలరీని ప్రారంభించింది. జూబ్లీ హిల్స్‌లోని 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వారి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఇక్కడ మరో అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తలు సిద్ధాంత్‌ ఆనంద్‌, శివాని ఆనంద్‌లు స్థాపించారు. ఈ రంగంలో అనుభవజ్ఞులైన నిపుణుల కుటుంబం, ఖజానా గ్రూప్‌ నుండి వచ్చిన ఈ బ్రాండ్‌ వ్యక్తిగత అభిరుచులు, జీవనశైలిని ప్రతిబింబించే ప్రదేశాలను రూపొందించడానికి కృషి చేస్తుందని సిద్దాంత్‌ పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో 10 ప్రధాన నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.