మండలంలోని రామారెడ్డి, పోసాని పేట్ గ్రామాల్లో శనివారం వరి కొనుగోలు కేంద్రాలను అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి, డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని, ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి, రైతులు లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పశుపతి, సీఈఓ బైరయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మా గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.