మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని పడకల్‌ గ్రామం లో శనివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పీఎసీఎస్‌ సీవో ప్రతాప్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులు నుంచి నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం మండలంలో 2029 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న పంట ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.