హైదరాబాద్‌లో స్టైల్‌ అప్‌ స్టోర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌లో భాగమైన ‘స్టైల్‌ అప్‌’ హైదరాబాద్‌లో 7వ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. నల్లగండ్ల వద్ద కొత్తగా ప్రారంభించిన అపర్ణ నియో మాల్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఇది దేశంలో తమకు 30వ స్టోర్‌ అని వెల్లడించింది. 8,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేశామని పాంటలూన్స్‌ సీఈఓ సంగీత పేర్కొన్నారు.