
మండలంలోని గోకుల్ తండాలో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంఘ్య నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు వరి ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు లక్ష్మా గౌడ్,ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.