మోకన్ పల్లి సొసైటీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ…

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని మోకన్ పల్లి సొసైటీ ఏర్పాటుకు డిసిఒ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణకు బినొల సొసైటీ పాలకవర్గం గురువారం జిల్లా కేంద్రంలో హాజరయ్యారు. గతంలో మోకన్ పల్లి సహకార సంఘాన్ని బినోల ప్రాథమిక వ్యవసాయ సంఘంలో విలీనం చేయడంతో యధావిధిగా వేరు చేయాలని గతంలో పాలకవర్గం తీర్మానం చేయడంతో జిల్లా సహకార అధికారి సంఘ ఆర్థిక వివరాలు సంఘ సభ్యుల వివరాలు ఆర్థిక పరిపుష్టిపై, సంఘ స్థితిగతుల నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మగ్గరి హన్మాన్లు, ఉపాధ్యక్షులు ఖాజా మొహినోద్దీన్, పాలకవర్గ సభ్యులు విజయ్, అంజాగౌడ్, గంగాధర్, బాలచందర్, రమణారావు, నవీన్ రావ్, బేగరీ గంగాధర్, సీఈవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.