– వ్యవసాయ సహాయ సంచాలకులు రుద్రమూర్తి, ఏవో యాదగిరి
నవతెలంగాణ-యాలాల
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పైన రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అభిప్రాయాలను సేకరించి వ్యవసాయ శాఖకు అందజేసినట్టు మండల వ్యవసాయ అధికారి యాదగిరి తెలిపారు. మంగళవారం యాలాల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయ వ్యవసాయ సంచాలకులు రుద్రమూర్తి, వివిధ మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… రైతుల అభిప్రాయాలను కులం కుశంగా సేకరించి వాటిని యథాతధంగా వ్యవ సాయ శాఖకు పంపించినట్టు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ కేంద్రాలు, వ్యవసాయ శాఖకు అనుసంధానమై అభిప్రాయాలను పాలుపంచుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రుద్రమూర్తి మరియు తాండూర్, పెదెముల్, బషీరాబాద్ మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.