
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య ఆధీనియం అను చట్టాల అమలు తీరును పరిశీలించుట కొరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు (బి.పి.ఆర్.డి) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు (ఎన్.సి.ఆర్.బి) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, (సి.డి.టి.ఐ) సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఐబి ఇంటిలిజెన్స్ బ్యూరోల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సి డి టి ఐ హైదరాబాద్ డైరెక్టర్ రాజశేఖర్ ఐపిఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కమిషనరేట్ కు విచ్చేసి వివిధ శాఖల అధికారులతో చర్చించి వారి సందేహాలను అభిప్రాయాలను సేకరించారు.
