నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలు, సూచనలు సేకరణ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గౌరవ జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మహేంద్ర నాయక్, పిఎ సిఎస్ డైరెక్టర్లు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.