న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల కంపెనీ ఒప్పో కొత్తగా ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జిని ఆవిష్కరించింది. వీటి అమ్మకాలను జూన్ 20 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రీఆర్డర్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఆక్టా కోర్ మీడియా టెక్ 7050 ఎస్‌ఒసితో ఆవిష్కరించింది. 8జిబి ర్యామ్, 128జిబి లేదా 256 జిబి సహా 64 ఎంపి ప్రధాన కెమెరా, 2ఎంపి డెప్ట్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరాతో విడుదల చేసింది. 128 జిబి వేరియంట్ ధరను రూ.27,999గా, 256జిబి ధరను రూ.29,999గా నిర్ణయించింది.