న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో తన నూతన ఫైండ్ ఎక్స్8 సిరీస్‌ను నవంబర్ 21న గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటిం చింది.ఇండోనేషియాలోని బలిలో ఫైండ్ ఎక్స్8, ఫైండ్‌ఎక్స్8 ప్రోను ఆవిష్కరించ నున్నట్లు తెలిపింది. ఫైండ్ ఎక్స్‌ను 5,630 ఎంఎహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, ప్రోను 5,910 ఎంఎహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో అందుబాటులోకి తెస్తోంది.