ఒప్పో ఇంటర్నేషనల్‌ వారంటీ

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఒప్పో తమ ఉత్పత్తులపై ఇంటర్నేషనల్‌ వారంటీని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. భారత్‌లో కొనుగోలు చేసిన ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులపై గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాల్లోనూ సర్వీసు సేవలను పొందవచ్చని సోమవారం ప్రకటించింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, కువైట్‌, బహ్రాన్‌, ఒమన్‌, ఇండియా దేశాల్లోని తమ ఉత్పత్తులను తమ బ్రాండ్‌ సర్వీసు సెంటర్లలో రిపేర్‌, వారంటీ, అప్‌గ్రేడ్‌ సర్వీసు సేవలను పొందవచ్చని పేర్కొంది.