టెలిఫోటో కెమెరాతో ఒప్పో రెనో10 5జీ

హైదరాబాద్‌ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు ఒప్పో కొత్తగా మార్కెట్లోకి ఒప్పో రెనో10 5జీని విడుదల చేసినట్టు తెలిపింది. దీన్ని పొట్రెయిట్‌ ఫోటోగ్రఫీకి కొత్త నిర్వచనం ఇచ్చేలా టెలిఫోటో కెమెరాతో డిజైన్‌ చేసినట్లు ఒప్పో ఇండియా ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ లీడ్‌ కరణ్‌ దువా తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఒప్పో రెనో10 5జీని కరణ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8జీబీ, 256జీబీ ర్యామ్‌ కలిగిన దీని ధరను 32,999గా నిర్ణయించినట్లు వెల్లడించారు. 64 ఎంపి ఒవి64 అల్ట్రా క్లియర్‌ మెయిన్‌ కెమెరా, 32 ఎంపి ఐఎంఎక్స్‌709 టెలిఫోటో పొట్రాయిట్‌ కెమెరా, 8ఎంపి కెమెరాలతో సహా సెల్ఫీ కోసం 32 ఎంపి ఒవి32సి అల్ట్రా క్లియర్‌ కెమెరాతో విడుదల చేశామన్నారు. 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 47 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుందన్నారు.