100 ఎఐ ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్లు..!

100 ఎఐ ఫీచర్లతో ఒప్పో స్మార్ట్‌ఫోన్లు..!న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఒప్పో కృత్రిమ మేధా (ఎఐ) ఆధారిత స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. 2024 ముగింపు నాటికి 100 పైగా జనరేటివ్‌ ఎఐ ఫీచర్లతో కొత్త ఫోన్లను తీసుకు రానున్నామని ఒప్పో ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ప్రెసిడెంట్‌ బిలి ఝాంగ్‌ తెలిపారు. ప్రతీ ఒక్కరికి ఎఐ ఫోన్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలుత దాదాపు 5 కోట్ల వినియోగదారులను చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.