– మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్రంలో మాలలు 10-15% ఉన్నారని కుల గణన జరిగిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారము రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా అవకాశాలు కల్పించాలని, ఇకముందు రాష్ట్రంలో ఇచ్చే చైర్మన్ పదవులలో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పటి వరకు వర్గీకరణ అంశాన్ని నిలిపి వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మాల మహానాడు టీం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణా రాష్ట్రంలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఇంకో మంత్రి పదవి ఇవ్వాలి.రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 40 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. కాని మాల కులస్తులకు ఏ ఒక్క చైర్లైన్ పదవి ఇవ్వలేదు. కాబట్టి ఇక ముందు ఇచ్చే కార్పొరేషన్ పదవులలో మాల కులస్తులకు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంతో యూనివర్సిటీ చైర్మన్ పదవులు మాలలకు ఇవ్వాలి. టీజీపీఎస్సీ సభ్యులుగా మాల కులస్తులకు ఇవ్వాలన్నారు. ఉన్నత విద్యా మండలి పదవులలో మాలలను ప్రాముఖ్యత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ , ఎస్సీ కమిషన్ పదవులు ఇవ్వలేదు, ఇప్పుడు మాలలకు అవకాశం ఇవ్వాలన్నారు.ఈ రాష్ట్రంతో మాలలు 10-15% ఉన్నారు, కావున కుల గణన జరిగిన తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారము రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా అవకాశాలు కర్పించాలి. అప్పటి వరకు వర్గీకరణ అంశాన్ని నిలిపి వేయాల్సిందిగా ప్రభుత్యాన్ని కోరుతున్నామన్నారు. కొంత మంది మాలలను మనువాదులగా చిత్రీకరించి ఇతర పార్టీలకు చూపిస్తున్నారు. ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ తో ఎలెర్లస్ తో మాలలకు ఓటు వెయ్యోద్దని మతతత్వ మత్ తత్వ పార్టీలకు వత్తాసు పలుకుతూ ప్రచారం చేసిన నాయకులే మనువాదులు అని అన్నారు.ప్రభుత్యోనికి జిల్లా మాలమహానాడు,టీం అద్వర్యంతో జరిగిన పత్రికా సమావేశంలో మాలలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారు. ఈ విషయాన్ని గమినించ వలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు టీం మాజీ చైర్మన్ దేవిదాస్, మాల మహానాడు జిల్లా కార్యదర్శి వినయ్, నగర మాల మహానాడు జిల్లా కార్యదర్శి గైని దయాసాగర్, నీలకంఠేశ్వర్ మాల సంఘం కార్యదర్శి పోశెట్టి, నీలకంఠేశ్వర్ మాల సంఘం కోశాధికారి గోపు మురళి, మాల సంక్షేమ సంఘం గంగస్థాన్ 2 కార్యదర్శి గంగాధర్, చంద్రకాంత్, సాయిలు, గంగాధర్, దయానంద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.