పోడు భూములల్లో సాగు చేసుకునే అవకాశం కల్పించాలని ప్రజా సంఘాల నాయకుడు జాలపెల్లి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో సోమ వారం ప్రజా సంఘాల నాయకులు మనోజ్ కుమార్ పోడు రైతులతో సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీర్నపల్లి మండల వ్యాప్తంగా పోడు రైతుల పై అక్రమ కేసులు ఎత్తివేసి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్ టీ, బీసీ, అగ్రవర్ణ నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో పోడు రైతుల నుండి స్వికరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్నీ కోరారు. ఈ కార్యక్రమంలో పోడు రైతులు ఉన్నారు.