కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి.. 

– తుమ్మల వెంకట్ రెడ్డి. సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న  ఆ ప్రజాస్వామిక నియంతృత్వ పోకడలను మతతత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలం పసరలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. పార్లమెంట్లో ఇటీవల కాలంలో జరిగిన పొగ బాంబు  ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో ప్రతిపక్షాలు చర్చ జరగాలని ,దోషుల ను లో కఠినంగా శిక్షించాలని పేర్కొంటూ పార్లమెంట్లో ప్రజాస్వామ్య విధంగా అడుగుతుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యకు చర్యని పేర్కొన్నారు పార్లమెంట్లో ఒక పొగ బాంబు వేసిన వ్యక్తులు మైసూర్ పార్లమెంట్ బిజెపి సభ్యుడు లెటర్ ప్యాడ్ పై పార్లమెంట్ కు వస్తే ఆ పార్లమెంటు సభ్యునిపై చర్య తీసుకోకుండా ఈ ఘటనపై విచారణ జరపాలని పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తుంటే హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పకుండా నియంతృప్తంగా 147 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి, నల్ల చట్టాలను  ఆమోదించు కొన్నారని పేర్కొన్నారు దేశంలో ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు దేశ భద్రతకు సంబంధించిన చెప్పి మూక దాడులు చేస్తున్న వారిపై దేశద్రోహం కేసులు పెడతామని పేర్కొన్నారు .అసలు దేశంలో గోమాసం తింటున్నారని దళితులపై ముస్లింలపై మూక దాడులు చేస్తూ దొంగే దొంగ అన్నసందంగా బిజెపి ప్రజాస్వామికంగా వివరించి ప్రతిపక్షాలపై నిందలు మోపుతూ మతం పేరుతో సనాతన సంప్రదాయాలు వ్యతిరేకించే వారందరూ దేశద్రోహులే అని వక్ర భాష్యాలు చెబుతున్నారు. భవిష్యత్తులో దేశంలో లౌకికవాదం సెక్యూరిజం కాపాడాలని, కేంద్ర ప్రభుత్వ   మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మతసామరస్యం కాపాడాలని ప్రజలందరికీ సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు, గొంది రాజేష్, మండల నాయకులు అంబాల మురళి, రెడ్డి పురుషోత్తం రెడ్డి, పల్లపు రాజు, కందుల రాజేశ్వరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.