యూజిసి ముసాయిదాను వ్యతిరేకిస్తూన్నం..

– పి డి.ఎస్.యూ ఆద్వర్యంలో తే.యూ రిజిస్టర్ ద్వారా గవర్నర్ (ఛాన్సలర్) లేఖ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా కొత్తగా తయారు చేసిన యూజీసీ ముసాయిదాను  ఉపసంహరించుకోవాలని పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్  డిమాండ్ చేశారు. యుజిసి ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని గవర్నర్ (యూనివర్సిటీ ఛాన్సలర్)కు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ద్వారా లేఖను పి.డి ఎస్.యూ ఆద్వర్యంలో శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ లను కార్పోటీకరణ, కాషాయీకరణ చేయడానికి నూతనంగా యూజీసీ లో కొత్తగా నిబంధనలను తీసుకువచ్చారని, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని మేం కోరుకుంటున్నా మని, యూజీసీ నిధులు యూనివర్సిటీల అభివృద్ధికి గత కొంతకాలంగా విడుదల చేయడం లేదని, యూనివర్సిటీలకు యూజీసీ ద్వారా నిధులు కేటాయించాలని,
రాష్ట్రల పరిధిలో  ఉన్న యూనివర్సిటీలలో కేంద్రం పెత్తనం చెయడానికి కుట్రలు పన్నుతోందని, పారిశ్రామికవేత్తలను, తమ భావజాలానికి అనుకూలంగా ఉండే వారిని  వైస్ ఛాన్సలర్ లను నియమించడానికి సవరణలు చేస్తున్నారని, వైట్ ఛాన్సలర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్టు ప్రొఫెసర్ల ప్రస్తుత నియామక అర్హతలు కొనసాగించాలని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యూజిసి లో తమ అనుకూల విధానాలను విద్యలో ప్రవేశపెడు తున్నారని ,యూనివర్సిటీల  పీహెచ్డీ ప్రవేశాలలో సెట్, నెట్ లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే నూతనంగా తీసుకువచ్చిన యూజీసీ నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, దేవిక, అక్షయ్, రాకేష్, హుస్సేన్, రోహిత్, తిరుపతి,  తదితరులు పాల్గొన్నారు .