బాలయ్య సరసన..!

నందమూరి బాలకష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్‌బికె 108 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్‌ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకష్ణ చేయి పట్టుకున్నట్లుగా ఉన్న ఓ స్టిల్‌ని మేకర్స్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలకష్ణ నటిస్తున్నారు. సినిమాలో ఆయన డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. బాలకష్ణ మార్క్‌ యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్స్‌, అనిల్‌ రావిపూడి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలిమెంట్స్‌ ఉండబోతున్నాయి. బాలకష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన తమన్‌ ఈ చిత్రానికీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది, డీవోపీ: సి రామ్‌ ప్రసాద్‌, ఎడిటర్‌: తమ్మి రాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ ఫైట్స్‌: వి వెంకట్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.కష్ణ.