రామ్ చరణ్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం కోసం ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వద్ధి సినిమాస్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో గ్రాండ్‌గా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్వాగతం పలికారు. ఈ జోడి తెరపై అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులని మంత్రముగ్దులను చేయబోతోంది. ఈ మెగా వెంచర్‌కి ఆస్కార్- విన్నింగ్ కంపోజర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, బ్యానర్: వద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సంగీతం: ఏఆర్ రెహమాన్.