నవతెలంగాణ – బొమ్మలరామారం
బొమ్మలరామారం మండల లోని రామలింగంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు రెండు కోట్ల యాభై లక్షల వ్యయము తో నిర్మించిన 26 గృహాలను సెఖ్మెట్ ఫార్మా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్స్ ప్రతినిధులు బుధవారం పేదలకు ఇండ్ల అంకితం చేశారు.ఈ సందర్భంగా సెఖ్మేట్ ఫార్మా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓఓ ఎన్ భాస్కరన్, సిహెచ్ఆర్ఓఓ గండూరి ఉమారావ్,అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్వో మల్లికార్జున్ జోషుల, ఏవిపి ఆపరేషన్ జి సుబ్రహ్మణ్యం,అసోసియేట్ డైరెక్టర్ హెచ్ఆర్ దేవేందర్ రెడ్డి,తోపాటు గ్రూప్స్ సంబంధిత ప్రతినిధులు మాట్లాడుతూ.. రామలింగంపల్లి గ్రామ శివారులో నెలకొల్పిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానికులకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించడంతోపాటు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి దశలో 26 మందికి సెఖ్మేట్ ఫార్మా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించి పేదవారికి అంకితం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రామలింగంపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి తమ సొంత ఇంటి కల నిజం చేయాలన్నదే తమ గ్రూపు సభ్యుల ఉద్దేశం అని తెలిపారు.రెండవ దశలో కూడా ఇల్లు లేని వారిని గుర్తించి వారికి కూడా త్వరలో ఇల్లు నిర్మాణం చేపట్టి ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఇల్లు లేని వారికి ఇండ్లను నిర్మిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న గ్రూప్ సంస్థలను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం,ఎంపీటీసీ సభ్యులు హెర్వ హేమంత రెడ్డి,మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి,తాజా మాజీ సర్పంచ్ యంజాల కళా, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు యాంజాల సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి సిహెచ్ మల్లేశం,గ్రామ పెద్దలు బి నరసింహారెడ్డి,రాంరెడ్డి, ప్రవీణ్ సుంచు యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.