ఆరే సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి..

– మంత్రి పొన్నంకు మండల ఆరే సంఘ నాయకుల వినతి 
నవతెలంగాణ – బెజ్జంకి 
రాష్ట్రంలోని ఆరే కులస్తుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రమందజేసినట్టు మండలంలోని పాపన్నపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఏసిక శంకర్ రావు అదివారం తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువేళ్లే యత్నం చేస్తానని తెలిపినట్టు శంకర్ రావు తెలిపారు.