హైదరాబాద్ : తమ సంస్థకు ప్రభుత్వ రంగంలోని రైల్వే, విద్యుత్ రంగాల నుంచి పలు ఆర్డర్దు దక్కాయని ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సంస్థ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ తెలిపింది. కొత్త ఆర్డర్ల స్థితిని పంచుకోవడంపై సంతోషంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు వివిధ పిఎస్‌యుల నుంచి రూ.731.03 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకున్నట్టు వెల్లడించింది. మరిన్ని అదనపు ఒప్పందాలను పూర్తి చేయడానికి ముందస్తు దశలో ఉన్నట్టు పేర్కొంది.