పట్టణంలో మహిళ హ్యాండ్ బాల్ క్రీడా పోటీల నిర్వహణ

నవతెలంగాణ  – ఆర్మూర్  
29వ తేదీ నుండి 1 తేదీ డిసెంబర్ వరకు పట్టణంలో లో జరిగే 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి  జూనియర్ జూనియర్ మహిళా హ్యాండ్ బాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు గాను ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసి వారికి  సన్నదత శిబిరం సోమవారం  ప్రారంభించడం జరిగింది, ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షులు గంగామోహన్ చక్రు , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌడా సురేష్ ,ప్రధాన కార్యదర్శి పింజా సురేందర్,. కోశాధికారి ఘట్టడి రాజేష్,వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్, రమణ, శ్యామ్, నరేందర్, సునీత, మాధురి, సీనియర్ హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.