మోతీలాల్‌ ఓస్వాల్‌ మొబిక్‌ 7వ ఎడిషన్‌ ఏర్పాటు

ముంబయి : మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌) 7వ ఎడిషన్‌ మోతీలాల్‌ ఓస్వాల్‌ బిజినెస్‌ ఇంపాక్ట్‌ కాన్ఫరెన్స్‌ (మొబిక్‌)ని నిర్వహించినట్లు తెలిపింది. ముంబయిలో జులై 27, 28 తేదీల్లో దీన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఫ్రాంఛైజ్‌ నెట్‌వర్క్‌, అలాగే బ్రోకింగ్‌ సేవలలో అత్యుత్తమతను గుర్తించాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహించినట్టు తెలిపింది. దేశంలో డిమ్యాట్‌ ఖాతాలు భారీగా పెరిగాయని.. స్టాక్‌ మార్కెట్లపై ఆసక్తి పెరిగిందని ఎంఓఎస్‌ఎఫ్‌ఎల్‌ సీఈఓ మోతిలాల్‌ ఓస్వాల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి 1800 పైగా ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.