మండలం లోని రాజరలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిరాన్ని డాక్టర్ ఎం. శ్రావణి యాదవ్ ప్రారంభించి మాట్లడారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను నిర్వహించు కోవటం ద్వారా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. కిడ్నీ, గుండె, కళ్ళు సమస్యలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచుకోవడానికి సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ శిబిరంలో వందమందికి పైగా వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వైద్యులను యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు యూత్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ జిల్కరి నిఖిల్, వైస్ ప్రెసిడెంట్ అయిటి పవన్ కళ్యాణ్ యూత్ సభ్యులు రోహిత్, సాయి కుమార్, తరుణ్, ధను, ప్రసాద్, ప్రణయ్,పాల్గొన్నారు.