గైనకాలజికల్‌ అల్ట్రాసౌండ్‌పై సింపోజియం ఏర్పాటు

హైదరాబాద్‌ : ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అధునాతన గైనకాలజికల్‌ అల్ట్రాసౌండ్‌పై ”అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్‌ ది అడ్నెక్సా అండ్‌ ఎండోమెట్రియం: ఆప్టిమైజింగ్‌ డయాగ్నోసిస్‌ ఇన్‌ ఎవ్రీడే ప్రాక్టీస్‌” అనే పేరుతో ప్రత్యేకంగా ఒక సింపోజియంను నిర్వహించింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గైనకాలజికల్‌ అల్ట్రాసౌండ్‌లో ప్రముఖ నిపుణురాలు డాక్టర్‌ మాలా సిబల్‌ పాల్గొని స్త్రీ జననేంద్రియ పరిస్థితుల నిర్ధారణ, సంబంధిత చికిత్సలో ఆధునిక అల్ట్రాసౌండ్‌ పద్ధతులు ఎలా మారుతున్నాయో అనే అంశాలపై అవగాహన కల్పించారు. గైనకాలజీలో అల్ట్రాసౌండ్‌ అనేది గైనకాలజికల్‌ క్యాన్సర్‌లను గుర్తించే అద్భుతమైన రోగనిర్ధారణ పద్ధతి అని డాక్టర్‌ మాలా సిబల్‌ తెలిపారు. ఈ సింపోజియంలో దేశవ్యాప్తంగా వచ్చిన 200 మంది ప్రాక్టీస్‌ గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు, పాథాలజిస్టులు, ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేస్తున్న వారు, గైనకాలజికల్‌ అల్ట్రాసౌండ్‌లో శిక్షణ పొందినవారు పాల్గొన్నారు.