నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఐఎస్‌ఓ – 21001 గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధి శివయ్య ఐఎస్‌ఓ – 21001 గుర్తింపు పత్రాన్ని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళా రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వైద్య కళాశాలకు దక్కని గుర్తింపు మొదటిసారిగా ఉస్మానియా మెడికల్ కాలేజీకి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాలేజీలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు, భద్రత అందిస్తున్నట్టు ఆమె చెప్పారు.