
– ఓటు హక్కు వినియోగంపై కళాబృందం అవగాహన
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజాస్వామ్యానికి ఓటే వజ్రాయుధమని..ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సారథి మొగిలిపాక స్నేహ సూచించారు.ఆదిధారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం ఓటు హక్కు వినియోగం,పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.కళాకారులు కందుకూరి శంకర్ బాబు,ఎలగందుల భాస్కర్,ఠాకూర్ మనోహర్ సింగ్,పాతపల్లి సౌమ్య,తీగుళ్ళ అరుణ, ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జీ చింతకింది పర్శరాములు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.