బీఆర్‌ఎస్‌కు ఓటేయం : చందన్‌వెళ్లి భూనిర్వాసితులు

– ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం
– భూనిర్వాసితుల సంఘం నుంచి ఒక అభ్యర్థిని పోటీలో నిలబెడుతాం
నవతెలంగాణ-షాబాద్‌
చందన్‌వెళ్లి భూనిర్వాసితులకు న్యాయం చేయని బీఆర్‌ఎస్‌కు ఓటు వేయమని చందన్‌వెళ్లి భూనిర్వాసితుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించారు. సంఘం అధ్యక్షుడు నీరటి అంజనేయులు మాట్లాడుతూ… చందన్‌వెళ్లి భూనిర్వాసితులు అందరూ కలిసి నిరసనలు, దీక్షలు చేసి జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌, మంత్రులు, కేటీఆర్‌కు కూడా విన్నవించుకున్నా ప్రయోజనం లేదన్నారు. త్వరలో తమకు న్యాయం చేస్తామని చెప్పి, ఎవ్వరు పట్టించుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రతీ గ్రామంలో ప్రచారం చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయవద్దని, భూని ర్వా సితుల సంఘం నుంచి ఒక అభ్యర్థిని పోటీలో ఉంచుతామన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు జంగయ్య, ఉపాధ్యక్షులు నర్సింహులు, రెడ్డయ్య, ప్రధాన కార్యదర్శి అనంతం, కోశాధికారి నర్సింహులు సంఘం నాయకులు, రైతులు రాంబాబుగౌడ్‌, దయాకర్‌, ఎల్లేష్‌, యూసఫ్‌, వెంకటయ్య, రాంచంద్రయ్య, కిష్టయ్య, అంజయ్య, వెంకటేష్‌, కిషన్‌, మల్లేష్‌, గణేష్‌, బాలమణి, పెంటమ్మ, జరినాబూగం, భాగ్యమ్మ, మంజుల, పుష్పమ్మ, పెంటమ్మ, సుగుణమ్మ తదితరులు ఉన్నారు.