సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానిశర్మ, కార్తీక్ రత్నం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్‌ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకారం చుడుతూ ఓ న్యూ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. అలాగే టీజర్‌ను ఈనెల 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, ‘ఈతరం యువత ఆలోచనలు, వారి ఎమోషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది ఈ చిత్రంలో మూడు పాత్రల ద్వారా చూపిస్తున్నాం. ఇది వారి జీవితంలోని ఆసక్తికరమైన కథ, కథనాలను ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చూపించే ప్రయత్నం చేశాం. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన హైపర్ లింక్ డ్రామా ఇది’ అని అన్నారు. మోడ్రన్ సెన్సిబిలిటీస్‌తో అందరికి నచ్చే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని నిర్మాత చెప్పారు.