ఓయూకు ఎన్నికల ఫీవర్‌ బోసిపోయిన యూనివర్సిటీ

నవ తెలంగాణ- ఓయూ
ఎన్నికల సమయంలో విద్యార్థులు ఇండ్లకు సొంత గ్రామాల్లో ఉండటంతో ఓయూ పూర్తిస్థాయిలో బోసిపోయింది.సెంట్రల్‌ లైబ్రెరీ అయితే వెలవెల బోతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. ప్రస్తుత ఎన్నికలలో ఓయూ కీలక పాత్ర పోషిస్తుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఓయూ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కొందరు పోటీల్లో ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, పార్టీల నుండి టికెట్స్‌ ఆశించి భంగపడ్డారు. చివర వరకు ముమ్మర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. గత్యంతరం లేక చివరి సమయంలో కొందరు పార్టీలు మారారు. డబ్బు లేకపోవడం, రాజకీయంగా పట్టు లేకపోవడం, మరికొందరికి సహకరించే నేతలు లేకపోవడంతో వారికి టికెట్‌ రాలేదని సమాచారం. వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వారి వారి నియోజకవర్గ పరిధిలోని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, ఇంకొందరు పార్టీలు ఇచ్చిన ఎన్నికల బాధ్యతల్లో పాల్గొంటున్నారు. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఆయా పార్టీల్లో ఇచ్చిన బాధ్యతలను చేస్తున్నారు.