18వ డివిజన్ లో గుంతలు లేని రోడ్లు నిర్మించడమే మా లక్ష్యమని కార్పొరేటర్ బాదే అంజలీదేవి అన్నారు. డివిజన్ లో వర్షాల వల్ల రోడ్లు పాడై ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గుంతలుగా ఉన్న ఇందిరా నగర్, లక్ష్మి నగర్ ప్రాంతాలలో లక్ష రూపాయల ఫ్లడ్ డిజాస్టర్ ఫండ్ కింద మట్టి, కంకర, డస్ట్ తో రోడ్లను పూడ్చారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ బాదే అంజలీదేవి మాట్లాడుతూ.. సమస్యా రహిత డివిజన్ గా మార్చుటకు కృషి చేస్తున్నానని పూర్తిగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడమే తమ ప్రధాన కర్తవ్యమని ఇంకా ఎక్కెడెక్కడ సమస్యలున్నాయో గుర్తించి అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ లో వీది దీపాల సమస్య తీర్చామని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి సమస్య తీర్చామని, ఇంటింటికీ నల్లా కనెక్షన్ కూడా ఇప్పించామని అన్నారు. సంక్షేమ ఫలాలను కూడా డివిజన్ లోని అందరికీ అందిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. తొందరలోనే సమస్యల పరిష్కారం కొరకు డివిజన్ అంతా పర్యటిస్తామని అన్నారు.