ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపే మన ముందున్న లక్ష్యం

– సూరపనేని సాయికుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే మన ముందున్న ప్రధాన లక్ష్యం అని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సురపనేని సాయికుమార్ అన్నారు. బుధవారం మండలంలోని మొట్లగూడం  గ్రామం మరియు ప్రాజెక్ట్ నగర్ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు వాసం శివాజీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ కేసీఆర్  ప్రవేశపెట్టిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ ములుగు జిల్లా అభివృద్ధి చెందాలంటే మన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గారు గెలవాలి, మండలంలో ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకు సంక్షేమ ఫలాలు ఎలా అద్దుతున్నాయో అలాగే మరి ఐదు సంవత్సరాలలో కూడా అలాగే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని అన్నారు . దృఢ సంకల్పంతో బడే  నాగజ్యోతి గెలుపు లక్ష్యంగా వివిధ గ్రామాలలో ప్రసారం చేయడం జరిగింది ప్రాజెక్టునగర్ మరియు మోట్లగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. ఇది కార్యక్రమంలో ఎంపీటీసీ వెలిశాల స్వరూప మండల సమన్యాయ సమితి సభ్యులు బుర్ర సురేందర్ పసరా గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి వి లక్ష్మణ్ సీనియర్ నాయకులు మురళి సమ్మయ్య శ్రీను నాగేష్ 100 బూతు కమిటీల సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.