శ్రీవిష్ణు హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సామజవరగమన’.. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని తాజాగా రూ.50కోట్ల మార్క్‌ని దాటి, శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజేష్ దండా మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించి రూ.50కోట్ల క్లబ్‌లోకి వెళ్ళడం ఆశ్చర్యపరిచింది. వినోదం, ఫ్యామిలీ ఆడియన్స్‌ని దష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది. ‘నువ్వు నాకు నచ్చావ్, గీత గోవిందం’ లాంటి స్క్రిప్ట్ అని నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకం నిజమైరది. ఇది నాలుగో వారం. నాలుగో వారంలో కూడా థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఒక చిన్న సినిమా ముఫ్ఫై రోజులు థియేటర్స్‌లో ఆడటం చాలా పెద్ద విజయం. అలాగే యుఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ సాధించింది. ఈ సినిమాకి ప్రీమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి.ఈ సినిమాని అన్ని భాషల నుంచి రీమేక్ కోసం అడుగుతున్నారు. తమిళంలో మేమే ప్రొడక్షన్ చేయాలని అనుకుంటున్నాం’ అని అన్నారు.