నవతెలంగాణ – వేములవాడ రూరల్
కుల సంఘాల అభివృద్ధికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జెడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గౌడ సంఘ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవి మాట్లాడుతూ.. ఆరు లక్షల రూపాయల నిధులతో గౌడ సంఘ భవన నిర్మాణం ప్రారంభించుకున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ నిధుల నుండి మూడు లక్షలు మంజూరు చేసామని, సిడిపి నిధుల నుండి మరో రూ.3 లక్షల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంజూరు చేశారని వెల్లడించారు. జెడ్పీటీసీ గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అనుకూలంలో దాదాపు పది కుల సంఘాల వరకు భవనాలు నిర్మించుకున్నామని, మిగిలిన వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గౌడ సంఘ భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని మ్యాకల రవి కుల సంఘా సభ్యులకు సూచించారు. అనంతరం కుల సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమకు సహకరించిన జెడ్పీటీసీ మ్యాకల రవికి, అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గౌడ సంఘం కులస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.