సభ్యుల సంక్షేమమే మా లక్ష్యం..

సభ్యుల సంక్షేమమే మా లక్ష్యం..‘మనం పుడితే తల్లి సంతోష పడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం సంబరపడాలి’ అని టి ఎఫ్‌ డి ఏ ఎన్నికల ప్యానెల్‌ సమావేశంలో దర్శకుడు వి.సముద్ర అన్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ 2024 ఎన్నికల సందర్భంగా వి. సముద్ర ప్యానెల్‌ తమ మేనిఫెస్టోతో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమ పానెల్‌ ఎన్నికైతే టి ఎఫ్‌ డి ఏ ద్వారా భవిష్యత్తుకు ఏం చేయాలి అనే ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో దర్శకుడు వి. సముద్ర, మద్దినేని రమేష్‌, మధుసూదన్‌ రెడ్డి మరియు కస్తూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, ‘నేను దర్శకుడిగా 18 సినిమాలు చేశాను. అందులో 12 హిట్‌ అయ్యాయి. దాదాపు 170 మంది అసోసియేట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు నా దగ్గర నుంచి ఇండిస్టీకి పరిచయమయ్యారు. ఈ ఎన్నికలలో ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాను. పదవీ కాంక్షతో కాకుండా అందరికీ సేవ చేయాలి, మంచి చేయాలి అనే ఆలోచనతో పోటీ చేస్తున్నాను. ఈ టిఎఫ్‌డిఏ ఎన్నికల్లో నన్ను ఓటేసి గెలిపిస్తే ప్రెసిడెంట్‌గా నేను చేపట్టిన బాధ్యతల్ని, మా మేనిఫెస్టోలో ఉన్న హామీలను కచ్చితంగా నిర్వహిస్తానని మాటిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈసారి నేను జనరల్‌ సెక్రటరీగా వి.సముద్ర ప్యానల్‌ తరుపున పోటీ చేస్తున్నాను. గతంలో నేను దర్శకుల సంఘంలో ఈసీ మెంబర్‌గా, ఆర్గనైజేషన్‌ ట్రెజరర్‌గా, జనరల్‌ సెక్రటరీగా మెట్టు మెట్టుగా ఎదిగాను’ అని మద్దినేని రమేష్‌ చెప్పారు. మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘నేను ట్రెజరర్‌గా పోటీ చేస్తున్నాను. గతంలో టి ఎఫ్‌ డి ఏ నుంచి ఉన్న సభ్యులు చాలా గౌరవప్రదంగా చూసుకున్నారు. దాన్ని ఎక్కడ తగ్గించకుండా కించపరచకుండా మా ఫ్యానెల్‌ ముందుకు తీసుకెళుతుందని, ఫండ్‌ రైజింగ్‌ ద్వారా అందరికీ మంచి జరిగేలా చూస్తాం’ అని తెలిపారు. కస్తూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘నేను సముద్ర గారి ప్యానెల్‌లో జాయింట్‌ సెక్రెటరీగా కంటెస్ట్‌ చేస్తున్నాను.