ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధనే మా లక్ష్యం 

– బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య 
నవతెలంగాణ పెద్దవంగర: ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధనే మా అంతిమ లక్ష్యమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 7న నిర్వహించనున్న లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పాడని అన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలని శాంతియుతంగా ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. ప్రతి మాదిగ సంఘాలకు అతీతంగా మనస్పర్థలు పక్కకు పెట్టి జాతి అభివృద్ధి కోసం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు వేల గొంతుల సాంస్కృతిక ప్రదర్శనకు భారీగా తరలిరావాలని కోరారు. జాతి కోసం, జాతి బిడ్డలుగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మాదిగలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఫిబ్రవరి 7 లోపు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో కెసిఆర్ రెండు దఫాలుగా  ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే, వర్గీకరణ కోసం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుక బిక్షపతి, మాజీ ఎంపీటీసీ ఎర్ర వెంకన్న, మండల దళిత నాయకులు దంతాలపల్లి శ్రీను, దంతాలపల్లి జనార్దన్, రాంపాక నారాయణ, కుందూరు వెంకన్న, గద్దల వెంకన్న, ఎడెల్లి యాకయ్య, ఈదురు వెంకన్న, ఈదురు ఐలయ్య, మురగుండ్ల పరశురాములు, పాశం రమేష్, గద్దల ఎల్లయ్య, గద్దల యాకూబ్, ఎల్లయ్య, యాసారపు ప్రవీణ్, మైలపాక బిక్షం, గద్దల నరేష్, చింత కరుణాకర్, మైలపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.