నవతెలంగాణ-గోవిందరావుపేట
భారతదేశానికి యువ నేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే మన ముందున్న ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ అన్నారు. గురువారం మండలంలోని బుసాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు పాయం యాదగిరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుధాకర్ హాజరై మాట్లాడారు. మహబూబాద్ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరిక బలరాం నాయక్ పోటీ చేయుచున్నారు అన్న విషయం అందరికీ తెలిసినదే.
రాహుల్ ప్రధానిగా చూడాలంటే బలరాం నాయకులు అధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల బుజస్కందాలపై ఉందని అన్నారు. యువనేత రాహుల్ గాంధీ గారిని మన భారతదేశ ప్రధాన మంత్రిగా చూడాలంటే మనమందరం కష్టపడి దేశమంతటా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవాలి అని అన్నారు. అదేవిదంగా ఓటర్ జాబితాలో పేరు లేని వారు ఫారం 6 ద్వారా పేరు నమోదు చేసుకోవాలి అని అన్నారు. మే 13 న పార్లమెంట్ ఎన్ని కాలు ఉన్నందున ఓటర్ జాబితాలో పేరు పరిశీలన చేసుకోగలరు. అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగానైతే ప్రతి బూతులను కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తీసుకువచ్చాము అంతకంటే అధిక మెజారిటీని తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలని అన్నారు. పార్టీ అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యమని స్వల్ప వ్యవధిలోని తమను పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించి మేనిఫెస్టోలో పేర్కొన్న మిగతా వాటిని కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడు పాశం మాధవరెడ్డి , జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు, మాజీ ఉపసర్పంచ్ బేతి దేవేందర్ రెడ్డి,కిసాన్ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు మరుకల రాజశేఖర్ రెడ్డి,గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు బేతి ప్రభాకర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పాశం యాదయ్య, sc సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు తిప్పరపు రాజబాబు, సీనియర్ నాయకులు ముద్దసాని సాయి, ఆవుల సోమిరెడ్డి, డికొండ కుమారస్వామి, పోలెపాక మహేందర్, బుద్రాల పైడి, బుద్రాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.